హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

ప్రిస్క్రిప్షన్ ఆధారిత మందుల విక్రయాలను కట్టుదిట్టం చేసేందుకు, వాటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్స్ రూల్స్‌కు సవరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం షెడ్యూల్ H, H1, X కేటగిరీలకు చెందిన మందులను విక్రయించే ప్రతి మెడికల్ స్టోర్‌లో CCTVలు ఏర్పాటు చేయడం తప్పనిసరి కానుంది. అలాగే ప్రిస్కిప్షన్ లేకుండా అనధికారికంగా మత్తు కలగించే మందులను విక్రయించకూడదు.