తమిళనాడులోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పాఠశాలల ద్వారా హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారంటూ సర్కార్ లేవనెత్తిన ఆరోపణలను తోసిపుచ్చింది. కేంద్ర పథకం అనే కారణాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను నిరాకరించడం సరికాదని హితవు పలికింది. ఈ అంశంపై కేంద్రంతో చర్చించాలని సూచించింది.
వార్తలు
తమిళనాడు పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం


