ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై అత్యుత్తమ నాయకుడిగా మోదీకి ఉన్న గౌరవాన్ని ఆయన ప్రశంసించారు. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మోదీ కృషి అసాధారణమన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో తనకు దక్కిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ దార్శనికత, రాజకీయ చతురత అద్భుతమంటూ పుతిన్ కొనియాడారు.
వార్తలు
ప్రధాని మోదీకి పుతిన్ శుభాకాంక్షలు


