హైదరాబాద్: 28°C
వార్తలు

‘వాణిజ్య ప్రయోజనాలు కాపాడుకుంటాం’

రష్యా, ఇరాన్‌పై అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన ఆంక్షల చట్టంపై భారత ప్రభుత్వం స్పందించింది. చమురు కొనుగోలు దేశాలపై 100% వరకు సుంకాలు విధించే ముప్పు ఉన్న నేపథ్యంలో, తమ 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా భిన్న మార్గాల్లో ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తామని తేల్చిచెప్పింది.