హైదరాబాద్: 28°C
వార్తలు

2,500 దీపాలతో మోదీ సైకత శిల్పం

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్‌లో ప్రముఖ సైకత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. 25 అడుగుల పొడవైన ఈ శిల్పాన్ని 2,500 మట్టి దీపాలతో అందంగా.. '25 ఇయర్స్ ఆఫ్ సేవా', 'ఆశీర్వాద్ కా దియా' థీమ్‌తో దీన్ని తీర్చిదిద్దారు. ఆ జగన్నాథుని ఆశీస్సులు మోదీకి ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.