హైదరాబాద్: 28°C
వార్తలు

సంచుల్లో కుక్కల్ని తెచ్చి వినూత్న నిరసన

మహారాష్ట్రలోని నిఫద్ నగర్‌లో వీధి కుక్కల బెడదను పట్టించుకోని అధికారికి స్థానికులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. ఏకంగా సంచుల్లో వీధికుక్కలను తీసుకొచ్చి పంచాయతీ చీఫ్ ఆఫీసర్ ఛాంబర్‌లోని ఆయన టేబుల్‌పై వదిలేశారు. అంతేకాకుండా కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండను ఆ అధికారి మెడలో వేసేందుకు ప్రయత్నించారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.