హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉదంపూర్ జిల్లాలో(J&K) భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోహన్ ప్రాంతంలో అనుమానిత కదలికలు ఉన్నాయన్న సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్స్, J&K పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.