హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి సీఎం యోగి విషెస్

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా యూపీ CM యోగి ఆదిత్యనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీని 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' దార్శనికుడిగా, నవ భారత నిర్మాతగా కొనియాడారు. 145 కోట్ల భారతీయుల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. 'నేషన్ ఫస్ట్' సంకల్పంతో సుపరిపాలనలో దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలిపారన్నారు. మోదీకి శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని యోగి ఆకాంక్షించారు.