పాకిస్తాన్, చైనా సంయుక్త సరిహద్దు కమిషన్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమని చెప్పింది. 1963 నాటి చైనా-పాక్ ఒప్పందం చట్టవిరుద్ధమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆక్రమిత భూభాగాలపై నిర్ణయం తీసుకునేందుకు ఆ కమిషన్‌కు ఎలాంటి అధికారం లేదని తేల్చిచెప్పింది.
వార్తలు
చైనా-పాక్ సరిహద్దు ఒప్పందం చెల్లదు: భారత్


