హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే మేనకోడలికి అధికారుల నోటీసులు

కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో నమ్మా క్లినిక్ వైద్యాధికారి, ఎమ్మెల్యే మేనకోడలు డా.అంకిత యారగల్ విధులకు వెళ్లకుండానే నెలకు రూ.70 వేల జీతం పొందుతున్నట్లు తేలింది. ప్రైవేట్ కాలేజీలో పీజీ చేస్తూ మార్చి నుంచి క్లినిక్‌కు రావడం లేదని అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. డాక్టర్ లేకున్నా క్లినిక్ ఎలా నడిపారనేది చర్చనీయాంశమైంది.