హైదరాబాద్: 28°C
వార్తలు

‘వ్యాపారులపై వేసినా సామాన్యుడికే భారం’

యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది అంజన్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఛార్జీలు నామమాత్రమే అయినా, వ్యాపారులు ఆ భారాన్ని అంతిమంగా సామాన్యులపైనే మోపుతారు. నిర్వహణ పేరుతో ఛార్జీలు వసూలు చేయడం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. ఈ ప్రక్రియ ఏకపక్షంగా ఉంది కాబట్టే దీనిపై వెంటనే స్టే విధించాలని కోరాం' అని ఆయన తెలిపారు.