హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

కోనసీమ: మామిడికుదురు మండలం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని అప్పనపల్లి గ్రామంలో ఈరోజు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ రాంబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్డీఎస్ఎస్ పనులలో భాగంగా కవర్డ్ కండక్టర్ రీప్లేస్మెంట్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.