హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆస్తిని విక్రయించి మోసం.. ఇద్దరు అరెస్ట్

ADB: మావల పరిధిలో ప్రభుత్వ ఆస్తిని సొంత ఆస్తిగా నమ్మించి, నకిలీ డోర్ నంబర్ సృష్టించి రూ.3.50 లక్షలకు విక్రయించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు CI ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. మున్సిపల్ అనుమతుల కోసం వెళ్లినప్పుడు అది ప్రభుత్వ స్థలమని తేలిందని బాధితులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. భూముల కొనుగోలు విషయంలో ప్రజలు మోసపోవద్దని సూచించారు.