హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తాగునీటి ప్రాజెక్టు పూర్తి అయ్యేలా కృషి చేస్తాం

GDWL: అలంపూర్ మండలం గుందిమల్ల గ్రామ పుష్కరఘాట్ సమీపంలో ఉన్న పాత తాగునీటి ప్రాజెక్ట్‌ను ఇవాళ మున్సిపల్ కమిషనర్ రాజేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పనులు చాలా కాలంగా మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పూర్తి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.