రూ.2 వేలు దాటిన UPI లావాదేవీలపై 0.4% MDR ఛార్జీలు విధించడంపై అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీ(Zee) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు చెందిన రూ.22 వేల కోట్ల రుణాన్ని ఇటీవల మాఫీ చేయకపోయి ఉంటే, రాబోయే 20 ఏళ్ల పాటు దేశంలో UPI ఉచితంగా లభించేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం NPCI దగ్గర ఏకంగా రూ.6,119 కోట్ల అదనపు నగదు ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
వార్తలు
‘ఆ అప్పు మాఫీ చేయకపోతే UPI ఫ్రీ’


