హైదరాబాద్: 28°C
వార్తలు

'కొత్తగా ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు'

SKLM: కోటబొమ్మాళి మండలంలో కొత్తగా 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ సీహెచ్‌ఎస్‌వీకే ప్రసాదరావు తెలిపారు. దీంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 70 నుంచి 78 కి పెరిగిందన్నారు. కొత్త కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. పాకివలస, పేటపాడు, మాసాహెబ్‌పేట కేంద్రాల సమస్యలను పార్టీల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.