హైదరాబాద్: 28°C
వార్తలు

అనంత్ నాగ్‌కు మోదీ కన్నడ విషెస్

ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రత్యేకంగా 'X' వేదికగా కన్నడ భాషలో శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా తన సహజ నటన, బహుముఖ ప్రజ్ఞతో భారతీయ, ముఖ్యంగా కన్నడ సినీ పరిశ్రమలో అనంత్ నాగ్ చెరగని ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. ఒక గొప్ప కళాకారుడికి దక్కిన అత్యుత్తమ, సరైన గౌరవం ఇదంటూ ప్రశంసించారు.