హైదరాబాద్: 28°C
వార్తలు

బాలల హక్కులపై డీసీపీవో అవగాహన

VSP: బాలికల రక్షణ, విద్య, సాధికారతతో పాటు చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల రక్షణ అధికారి కె.హరికృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బక్కన్నపాలెంలోని ఓ జూనియర్ కళాశాలలో అవగాహన కల్పించారు. బేటీ పడావో, బాల్య వివాహాల నిర్మూలన, చైల్డ్ హెల్ప్‌లైన్-1098, ఆత్మహత్యల నివారణ లాంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.