హైదరాబాద్: 28°C
వార్తలు

మక్కాపై డ్రోన్ దాడి.. భారత్ ఖండన

సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాపై హూతీ రెబల్స్ డ్రోన్ దాడికి పాల్పడటాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్ర దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు త్వరగా తొలగిపోయి, వీలైనంత త్వరగా అక్కడ శాంతిస్థాపన జరగాలని భారత్ ఆకాంక్షించింది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించేది లేదని స్పష్టం చేసింది.