హైదరాబాద్: 28°C
వార్తలు

‘మోదీజీ.. యూపీఐ ట్యాక్స్‌ను వెనక్కి తీసుకోండి’

UPI చెల్లింపులపై విధించిన ట్యాక్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ అగ్రనేత, LoP రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన 'X' వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సామాన్యులపై భారం మోపడం తగదని సూచించారు. అంతేకాకుండా, అమెరికా ముందు తలవంచడం ఇకనైనా ఆపాలని మోదీ ప్రభుత్వ విదేశాంగ తీరుపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.