హైదరాబాద్: 28°C
వార్తలు

108 రకాల పిండివంటలతో మహా ప్రసాదం

PPM: గుమ్మలక్ష్మీపురంలో కళింగ వైశ్య సంఘం, కె.వి.ఎఫ్. గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం మహిళలు ప్రత్యేకంగా మహా ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 రకాల పిండివంటలను తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మహిళల ఆధ్వర్యంలో పారాయణం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.