హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట'

AP: ప్రజలను పదేపదే మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 'స్థానిక ఎన్నికల కోసం కొత్త పెన్షన్ల పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారు. దశలవారీగా పెన్షన్లు అనేది పెద్ద మోసం. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైంది' అని ప్రశ్నించారు.