హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ముందుగా కేంద్ర మంత్రులు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సమావేశాలు విజయవంతం కావడంతో మోదీకి అభినందనలు తెలిపినట్లు సమాచారం. అనంతరం మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో చర్చిస్తున్నారు.