హైదరాబాద్: 28°C
వార్తలు

45 ఏళ్ల వయసులో పదో తరగతి పాస్

జమ్మూకు చెందిన 45 ఏళ్ల మహిళ రేణూ హన్స్ మాట్లాడలేని, వినలేని పరిస్థితిలోనూ తన కలను నెరవేర్చుకున్నారు. తన కొడుకు న‌మ‌న్ కౌల్ సహాయంతో పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం రేణూ హన్స్ పట్టుదలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆమె పట్టుదలను చూసి ప్రశంసిస్తూ పలు కామెంట్లు పెడుతున్నారు.