WGL: వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుగ్గొండి మండలంలోని వెంకటాపురంలో ఓ మహిళా రైతు తన పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. అప్పులు చేసి విత్తనాలు వేసినా వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బావులు, కుంటల్లో నీరు లేక సాగు ప్రశ్నార్థకంగా మారిందని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
చర్చనీయాంశంగా పొలంలో మహిళా రైతు ఫ్లెక్సీ..!


