హైదరాబాద్: 28°C
వార్తలు

రొంపిచర్ల క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

PLD: బొబ్బిలిలో జరిగిన సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో గుంటూరు జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించింది. జట్టులో రొంపిచర్ల హైస్కూల్‌కు చెందిన బాలురు, బాలికలు విశేష ప్రతిభ కనబరిచారు. విజేత క్రీడాకారులను నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీ సైదయ్య పాల్గొన్నారు.