హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీఐ పేమెంట్స్ ఛార్జీలపై ఖర్గే స్పందన

యూపీఐ పేమెంట్స్ ఛార్జీలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందించారు. డిజిటల్ చెల్లింపులపై పన్నుతో పొదుపులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. 'డిజిటల్ చెల్లింపు, నగదురహిత వ్యవస్థ కోసమే నోట్ల రద్దు అన్నారు. యూపీఐపై ఛార్జీలు ఉండవని ప్రకటించారు. వ్యాపారులపై పడే అదనపు భారం.. చివరికి ప్రజలే చెల్లించాలి. సామాన్యుల జేబులు కొల్లగొట్టేందుకు కేంద్రం మార్గాలు వెతుకుతోంది' అని విమర్శించారు.