హైదరాబాద్: 28°C
వార్తలు

'సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా ముందుకు సాగాలి'

పశ్చిమాసియా ఘర్షణల వల్ల ప్రపంచ దేశాల్లో ముడి చమురు, గ్యాస్ సరఫరా ప్రభావితం అవుతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయినప్పటికీ భారత్ అన్ని పరిస్థితులను ఎదుర్కొని 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లు తెలిపారు. యువత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.