హైదరాబాద్: 28°C
వార్తలు

జన్ జీ చెప్పేది వినేందుకు మేం సిద్ధమే: నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జన్ జీ, జన్ ఆల్ఫా చెప్పేది వినేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. యువతరం కూడా బాధ్యతలను భుజానెత్తుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. దేశం మనకేం ఇచ్చిందన్నది కాకుండా.. దేశం కోసం మనమేం చేస్తున్నామనే ధోరణిలో ఉండాలని అన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.