హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 19 నుంచి నైరుతి తిరోగమనం

దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనానికి సమయం దగ్గర పడిందని భారత వాతావరణశాఖ(IMD) వెల్లడించింది. ఈ నెల 19 నుంచి పశ్చిమ రాజస్థాన్‌‌లోని కొన్ని ప్రాంతాల మీదుగా రుతుపవనాల తిరోగమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. సాధారణంగా ఏటా SEP-17 నుంచి తిరోగమన ప్రక్రియ మెదలవుతుంది. ఈ ఏడాది 2 రోజుల ఆలస్యంగా ఈ ప్రక్రియ ప్రారంభంకానుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.