హైదరాబాద్: 28°C
వార్తలు

సెమీ రెసిడెన్షియల్ విధానంలో TPSలు

TG: యంగ్ ఇండియా స్కూళ్లకు భిన్నంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(TPS) సెమీ రెసిడెన్షియల్ విధానంలో నడవనున్నాయి. 2-3 ఎకరాలున్న బడులను TPSలుగా మార్చి, చుట్టుపక్కల స్కూళ్లను విలీనం చేస్తారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందిస్తారు. క్రీడా మైదానాలు, లైబ్రరీలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉంటాయి. అల్పాహారం, భోజనంతో పాటు విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తారు.