హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు

E.G: కోరుకొండ మండలం కాపవరంలో కుటుంబ కలహాలు ఉద్రిక్తతకు దారితీశాయి. భార్య కాపురానికి రావడం లేదన్న ఆగ్రహంతో అల్లుడు రామకృష్ణ తన అత్త వరలక్ష్మిపై సోమవారం కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల పక్కకు తిప్పడంతో వరలక్ష్మి చెంపపై కత్తి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కోరుకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.