హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త కళ్లెదుటే భార్య మృతి..!

ఏలూరు జిల్లా పోలవరం పాతూరు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై భర్తతో కలిసి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలవ్వడంతో భార్య లక్ష్మి (38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.