VZM: గరివిడి మండలం చుక్కవలసకు చెందిన గదల ఈశ్వరరావు (36) తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. ఇందుకు సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. దాతలు ఆర్థిక సాయం చేసి కాపాడాలని భార్య, గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
సాయం కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూపు


