హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రైన్‌లో నుండి జారిపడి వ్యక్తి మృతి

ప్రకాశం: ఒంగోలు-సూరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్ మధ్య రైలు నుండి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 35 -40 వరకు ఉండొచ్చని, కుడి చేతి పై అమ్మా నాన్న అని తెలుగులో ఉందని రైల్వే ఎస్సై శ్రీరామ్ తెలిపారు. మృతుని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.