హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేత మృతి.. నివాళి అర్పించిన మంత్రి

సత్యసాయి: రొద్దం మండలం గోనిమేకలపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ వెంకటరామిరెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతికదేహానికి మంత్రి సవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రొద్దం మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.