హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ నీలమణి దుర్గమ్మ ప్రత్యేక అలంకరణ

SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు మంగళవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.