ASR: వినాయకచవితికి సుమారు వారం రోజుల ముందే చింతపల్లిలో పండగ సందడి మొదలైంది. ఈనెల 14న చవితి సందర్భంగా ప్రధాన రహదారి పక్కన రంగురంగుల గణనాథుల విగ్రహాలు కొలువుదీరాయి. మారుమూల గ్రామాల నుంచి నిర్వాహకులు తరలివచ్చి తమకు నచ్చిన విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. యువత ఇంటింటా చందాలు సేకరిస్తూ మండపాల ఏర్పాట్లు, అలంకరణలు, విద్యుత్ దీపాల ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఆంధ్రప్రదేశ్
చవితికి ముందే చింతపల్లిలో గణపయ్య సందడి..!


