హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన రబ్బరు తాడు..!

GNTR: పాత గుంటూరు సీతానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అఫ్రోజ్ ఖాన్, అబ్రాల్ ఉల్ హఖ్ దంపతుల మూడేళ్ల కుమార్తె ఆడుకుంటూ ఉయ్యాల ఊగుతుండగా రబ్బరు తాడు మెడకు బిగుసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.