హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం

నెల్లూరు జిల్లాలో ఆగస్టులో విద్యుత్ వినియోగం గతేడాదితో పోలిస్తే 36 శాతం పెరిగిందని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో 319.109 మిలియన్ల యూనిట్లు విద్యుత్‌ను వినియోగించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో 433.61 ఎంయూ నమోదైందన్నారు.