AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో రూరల్ ఎస్సై రాజారావు ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను, స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెట్టుపల్లి గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర


