హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్ సర్క్యూట్‌తో చెరుకు తోట దగ్ధం

CTR: పాలసముద్రం మండలానికి చెందిన రైతు మునిరత్నం నాయుడుకు చెందిన మూడెకరాల చెరుకు తోట మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. విద్యుత్ తీగల నుంచి నిప్పురవ్వలు ఎగసిపడి తోట పూర్తిగా కాలిపోయినట్లు రైతు తెలిపాడు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. తీవ్రంగా నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.