హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో GOVT యాప్'

TG: ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. ఆ డ్రైవర్లతో పాటు ఇతరుల కోసం ప్రత్యేక బీమా పాలసీపై ప్రభుత్వం యోచిస్తోంది. ఆటోలను EVలుగా మార్చుకొనేందుకు యజమానులకు రూ.1.5లక్షల చొప్పున అందించేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సచివాలయంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో భేటీ అయి మాట్లాడారు.