హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గిరిజన బాలికల హాస్టల్‌లో బీఆర్ఎస్ నేత ఆకస్మిక తనిఖీ

MLG: ఏటూరునాగారంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై  BRS జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తాగునీరు, భోజనం, వాష్‌రూమ్‌లను పరిశీలించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని బాలికలు ఆరోపించగా, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.