హైదరాబాద్: 28°C
వార్తలు

ఇస్రో ప్రైవేటీకరణ ఉండదు: ఛైర్మన్‌

ఇస్రో ప్రైవేటీకరణపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలకు ఆ సంస్థ ఛైర్మన్ వి.నారాయణన్ చెక్ పెట్టారు. ఇస్రోను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని.. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలపై వారితో మాట్లాడి పరిష్కరిస్తామని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగినా.. ఇస్రోకు ముప్పు లేదని స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పరిశ్రమల పాత్ర కొత్తదేమీ కాదన్నారు.