హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డుపై గుంతలతో ఇబ్బందులు

SKLM: సోంపేట నుంచి బారువ వెళ్లే ప్రధాన రోడ్డులో గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వేళ, రాత్రి సమయంలో ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జింకిభద్ర సమీపంలో ఇటీవల మరమ్మతులు చేసినా మళ్లీ యథాస్థితికి వచ్చిందని తెలిపారు. గుంతలు పూడ్చి రోడ్డును బాగు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వాహనదారులు కోరుతున్నారు.