హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశం

ASR: రానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సోమవారం చింతపల్లి మండలంలోని సచివాలయ మహిళా పోలీసులతో సీఐ బీ.సింహాచలం సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.