హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌‌లోని 5 శాసనసభ నియోజకవర్గాలతో పాటు అసోంలోని 1 పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్నట్లు తెలిపింది. ఈ స్థానాలకు అక్టోబర్ 06న పోలింగ్ నిర్వహించి, 09న ఓట్లు లెక్కింపు ఉంటుందని చెప్పింది.