హైదరాబాద్: 28°C
వార్తలు

10 శాతం వరకు లంచాలు వసూలు చేశారు: విజయ్

గత ప్రభుత్వ పెద్దలు పార్టీ నిధుల పేరిట 7.5 శాతం నుంచి 10 శాతం వరకు కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేశారని తమిళనాడు సీఎం విజయ్ ఆరోపించారు. ఈడీ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడవుతోందని పేర్కొన్నారు. ఈడీ నివేదిక ప్రకారం అప్పుడు అధికారంలో ఉన్నది డీఎంకేనేనని చెప్పారు. ఎంకే స్టాలిన్, ఉదయనిధి తదితర కీలక నేతలు వసూళ్ల సొమ్ముకు ప్రత్యక్ష లబ్ధిదారులు అని మండిపడ్డారు.