హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ వినియోగదారులకు GOOD NEWS

వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్యాస్ బుకింగ్ గడువును తగ్గించినట్లు ప్రకటించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు కుదించింది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు కేంద్రమంత్రి సురేష్ గోపి వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడడంతో బుకింగ్‌లలో ఇబ్బందులు లేకుండా చూడాలని కంపెనీలను ఆదేశించినట్లు చెప్పారు.